రెడ్ బకెట్లో ఆహారం కుదిరిందా అధికారులు కుదిరార

సూర్యాపేటలో రెడ్ బకెట్ బిర్యానీ కేంద్రాన్ని మునిసిపల్ అధికారులు మూసివేస్తున్నామని ప్రకటించారు కొద్ది గంటల్లోనే సదరు దుకాణం తెరిచి కనబడింది మున్సిపాలిటీ వారు ఆ దుకాణానికి పదివేల రూపాయల జరిమానా వేసి అనుమతి ఇచ్చినట్టుగా మరుసటి రోజు పత్రికల్లో వార్త దర్శనమిచ్చింది ఇంతలోనే రెడ్ బకెట్ వారు ఆహార తయారీ నియమాలను మార్చుకున్నారా లేక అధికారుల మనసు మారిందా అనేదే జనం మాట్లాడుకుంటున్నారు ఒకవేళ రెడ్ బకెట్ తయారీలో లోపాలుంటే వారిని చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏవైనా సూచనలు చేయాలి కానీ మూసివేస్తున్నామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే మళ్లీ సదరు దుకాణం తెరుచుకోవడం వెనుక ఏం మాయ జరిగిందోనని జనం చెప్పుకుంటున్నారు అధికారులు తమ ఇష్టం ఉంటే ఏదైనా చేయగలరని అనుకుంటున్నారు ఆహార నియంత్రణ అధికారి చిరునామా దొరకదు ఎక్కడబడితే అక్కడ బకెట్ల దుకాణాలు వస్తూనే ఉన్నాయి. ఎవరు ఎలాంటి క్వాలిటీని నిర్వహిస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ కనీస పర్యవేక్షణ చేయరు మునిసిపాలిటీ వారు వారికి కోపం వస్తేనే అప్పుడప్పుడు ఇలా నటిస్తారు ఆ నటన వెనుక పారితోషకం కూడా ఉంటుందని జనం భావిస్తున్నారు ప్రజల మనసును గెలవాలంటే నిజాయితీగా క్వాలిటీని పెంపొందించాలి నిరంతర పర్యవేక్షణ ఉండాలి అప్పుడప్పుడు నటించడం మంచిది కాదని జనం అంటున్నారు నిజానికి పేటలో విపరీతమైన హోటల్లు పెరిగిపోయాయి వాటి పైన ఏ పర్యవేక్షణ ఉండదు జనగామ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక పేరు మోసిన హోటల్ అపరిశుభ్రతకు మారుపేరుగా ఉంటుంది ఆ హోటల్ పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది పెట్రోల్ బంక్ సమీపంలోనే ఆ హోటల్కు సంబంధించిన పోయి కూడా ఉంటుంది అయినా అధికారులు ఏమీ అనరు ఎందుకో అందరికీ అర్థమవుతూనే ఉంటుంది ఇప్పటికైనా అధికారులు తాము ప్రజలకు జవాబు దారి ప్రజల ఆరోగ్యానికి జవాబు దారి అనే జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందుతారు ప్రజల ఆరోగ్య సంరక్షణ తప్పనిసరిగా అధికారుల బాధ్యతే అవుతుంది ఇలా నటనలు మానుకొని నిజాయితీగా తమకోసం పనిచేయాలని జనం కోరుకుంటున్నారు
Related Images
Related News
ఎన్నిక సామగ్రి తరలింపు
సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: జిల్లాలో పట్టభద ...
జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి
సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్: నల్గొండ, ఖమ్మం, వ ...

లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు
శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...
క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: నూతనంగా ఎంపికైన ...
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు
తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: 25 వరకు యాదాద్రి ...
చదువు సామగ్రి పంపిణీ
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: విద్యార్థు చక్క ...
బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: సూర్యాపేట పట్టణ ...
నియామకం
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అసంఘటిత కార్మిక ...
ఘనంగా కాన్షీరామ్ జయంతి
సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్: అంబేద్కర్ వారస ...
డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి
సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్: తమకు సంబంధించిన ...
సాగర్ ఎన్నికకు మోగిన సైరన్
ఈ నె 23న నోటిఫికేషన్ విడుద నామినేషన్ దాఖుకు చివరి తేదీ ...
రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి
సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్: భారత కార్మిక సంఘ ...