Share this on your social network:
Published:
20-01-2023

ఓటరు జాబితాల ను సిద్దం చేయాలి

నూతన ఓటర్ల జాబితాను ఓటర్ల దినోత్సవం రోజున ప్రకటించుటకు సిద్ధంగా ఉంచాలని ఎలెక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బి. బాల మాయా దేవి అధికారులను సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ నందు నూతన ఓటర్ల జాబితా వివరాలను నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు జాబితాను జిల్లాలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు అందజేయుటకు చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి పాల్గొని సమీక్షించారు. ఈ సందర్బంగా అబ్జర్వర్ మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగా ఎలక్షన్ కమిషన్ వారు పంపించిన ప్రతిజ్ఞ చేయాలని, నూతన ఓటర్లకు ఏపిక్ కార్డు అందజేసి సన్మానించాలని అబ్జర్వర్ తెలిపారు. జిల్లాలో వికలాంగులకు ఓటరుగా నమోదు శాతాన్ని కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఓటర్ నమోదు ఫోటో మిస్సింగ్ డబుల్ ఎంట్రీ వివరాలను మరణించిన వారి సంఖ్య నియోజకవర్గాల వారీగా ఆర్డిఓ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు నియోజక వర్గాలలో పురుషుల ఓటర్లు 4,52 ,828 మహిళా ఓటర్లు 4,61,817 అలాగే ట్రాన్స్ జెండర్స్ 23 మంది477 సర్వీసు ఓటర్లు మొత్తం 9,14,668 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. నవంబర్ మాసంలోని 26,27 తేదీలలో జిల్లాలో నిర్వహించిన స్పెషల్ కాంపెయిన్ డే ద్వారా కొత్తగా ఓటర్ల నమోదు చేసుకున్నారని అలాగే ఓటర్ ఐ డి కి ఆధార్ లింకేజ్ 89 శాతం పూర్తి చేశామని మిగిలినవి త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట,రాజేంద్ర కుమార్, కోదాడ కిషోర్ కుమార్, హుజూర్ నగర్ వెంకా రెడ్డి, ఎలక్షన్ విభాగం పర్యవేక్షకులు పద్మారావు, డి.టి. వేణు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...