Share this on your social network:
Published:
20-01-2023

పెద్దగట్టు జాతర పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.

పెద్దగట్టు జాతర పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు ఘనంగ చేయాలి. ఫిబ్రవరి నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న అతి ప్రతిష్టాత్మకమైన దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పెద్దగట్టు జాతర ప్రాంగణమును పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు తగినట్లుగా చేయాలని పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలను తీసుకోవాలని కలెక్టర్ కోరారు. మంచినీటిని అందుబాటులో ఉంచాలి, పరిసరాలను ఎప్పటికీ అప్పుడు శానిటేషన్ చేయాలి అని కలెక్టర్ ఆదేశించారు. దుకాణాల ఏర్పాటు, ఎగ్జిబిషన్ పార్క్ ఏర్పాటు కేటాయింపు స్థలాలు పక్కగా ఉండాలి, వీటి ఏర్పాటు వల్ల భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ అన్నారు. ప్రతి అంశాన్ని ముందుచూపు, ప్రణాళికతో అమలు చేయాలి కలెక్టర్ పేర్కొన్నారు ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు రావొద్దు అని కలెక్టర్ సూచించారు . సూర్యాపేట ఆర్డీవో రాజేంద్ర కుమార్, DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, రవి, మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి, చివ్వేంల తసిల్దార్ రంగారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, CI లు, పెద్దగట్టు ఛైర్మెన్, చివ్వెంల మండల అధికారులు, SI లు ఉన్నారు.

Related Images



Related News


ఎన్నిక సామగ్రి తరలింపు

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: జిల్లాలో పట్టభద ...


జయ సారధి రెడ్డి విజయం తథ్యం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి

సూర్యాపేట, మార్చి 13, సూర్యాపేట టైమ్స్‌: నల్గొండ, ఖమ్మం, వ ...


లెక్కల్లో నాయకు.. బాక్సుల్లో ఓట్లు

శాసనమండలి ఎన్నికు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో అనూహ్ ...


క్షేత్రస్థాయిలో ప్రజ స్థితిగతును అధ్యయనం చేయాలి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: నూతనంగా ఎంపికైన ...


యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాు

తుంగతుర్తి, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: 25 వరకు యాదాద్రి ...


చదువు సామగ్రి పంపిణీ

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: విద్యార్థు చక్క ...


బవన్మరణానికి మహిళ యత్నం రక్షించిన స్థానికు

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: సూర్యాపేట పట్టణ ...


నియామకం

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అసంఘటిత కార్మిక ...


ఘనంగా కాన్షీరామ్‌ జయంతి

సూర్యాపేట, మార్చి 15, సూర్యాపేట టైమ్స్‌: అంబేద్కర్‌ వారస ...


డ్రైనేజీ పను నిలిపివేయాని వినతి

సూర్యాపేట, మార్చి 16, సూర్యాపేట టైమ్స్‌: తమకు సంబంధించిన ...


సాగర్‌ ఎన్నికకు మోగిన సైరన్

ఈ నె 23న నోటిఫికేషన్‌ విడుద నామినేషన్‌ దాఖుకు చివరి తేదీ ...


రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలి

సూర్యాపేట, మార్చి 17, సూర్యాపేట టైమ్స్‌: భారత కార్మిక సంఘ ...