Share this on your social network:
Published:
25-01-2023

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్రపంచం ముందు గర్వంగా నిలిపిన మహోన్నత నేత జవహర్లాల్ నెహ్రూ నవభారత నిర్మాత ఆయనే రాజకీయాలకు అతీతంగా దేశ నిర్మాణానికి కృషిచేసిన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన నిలిచిన కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే, అది విచ్ఛిన్నం అవుతుందని పాలన సాగదని వారికి పాలించుకునే సామర్థ్యం లేదని, లార్డ్ బీర్ కెన్ హెడ్ అనే గవర్నర్ జనరల్ చేసిన వ్యాఖ్యలు చరిత్రలో నిలిచి ఉన్నాయి. వాటిని తలకిందులు చేస్తూ ఈ జాతిని నిలబెట్టే కర్తవ్యాన్ని కాంగ్రెస్ స్వీకరించింది, అందుకే ఈ దేశం కోసం ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని భావితరాలకు ఉజ్వలంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. 395 నిబంధనలు 10 షెడ్యూలు తో పాటు పౌర హక్కులకు రక్షణ, సామాన్య ప్రజలకు భద్రత ఇలా ఎన్నో ఆధునిక విషయాలను ఒకచోట ఏర్పాటు చేసి దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అందించి దేశ గణతంత్రాన్ని నిలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, దేశ సౌభాగ్యానికి సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో అనేక రకాల వాదనలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి అభిప్రాయాలను కాంగ్రెస్ గౌరవించేది మహోన్నత ప్రతిభాశాలి ప్రపంచం గర్వించదగ్గ మేధావి దళిత జాతుల వైతాళికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాణ శిల్పిగా స్వీకరించింది. ఆయన నేతృత్వంలో అజయమైన రాజ్యాంగం రాగలదని కాంగ్రెస్ విశ్వసించి రాజ్యాంగాన్ని రూపొందించింది. విస్తృతస్థాయిలో చర్చలు జరిపింది వేలాది సవరణలు జరిపింది ప్రపంచానికే ప్రజాస్వామ్యంలో తలమానికంగా నిలిచేలా దేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించాలని, సంక్షేమాన్ని సాధించాలని సామాన్యులు కూడా మాన్యులుగా ఎదగాలని ఎన్నో కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రారంభించింది. దళిత, బహుజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను స్వీకరించింది. గాంధీ మహాత్ముడు ప్రారంభించిన హరిజన్ ఉద్యమం మొదలుకొని ఇందిరా గాంధీ పేద దళితులకు ఇచ్చిన ఇంటి స్థలాల వరకు అనేక కార్యక్రమాలను అందజేసి ఈ దేశ ఔన్నత్యాన్ని ప్రగతిని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో సాగిన సంక్షేమ పరంపర పేద ప్రజల అభ్యున్నతి ఏనాడు కాంగ్రెస్ ఆపలేదు. అందుకే ఈ దేశ ప్రజల ఆశాకిరణంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని నా విజ్ఞప్తి. 26 జనవరి గణతంత్ర దినోత్సవం నిజంగా అది విజయవంతమై ముందుకు సాగుతున్న క్రమంలో దానిని రూపొందించిన కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా ప్రజలు మననం చేసుకోవాలి ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. -మీ కల్వకుంట్ల సుజిత్ రావు.

Related Images



Related News


ఎస్‌బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన ...


త్వ‌ర‌లో గ్రూప్‌ 2, 3 నోటిఫికేష‌న్‌.. టీఎస్‌పీఎస్సీ కసరత్తు

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లోనే గ్రూ ...


ఇంజినీరింగ్‌ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు

– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న ...


783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచ ...


ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...


గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...


గ్రూప్‌-2 అభ్యర్థులకు అలెర్ట్‌...

* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-2 పర ...


నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి

ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...


దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి

సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...