చదువు కోసం... పర్యావరణం కోసం...

చదువు కోసం పర్యావరణం కోసం కృషి చేయాలనే కార్యక్రమం లో భాగంగా వాసవి క్లబ్ కోదాడ గురు వారం కార్యక్రమం జరిపింది.ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు పాలకుర్తి గాయత్రి పిలుపు మేరకు “విద్యా సేవ, ప్రకృతి సేవ” కార్యక్రమములో భాగంగా కోదాడ నయానగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోజరిపారు. విద్యా సేవ లో భాగంగా పేద విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణి చేశారు. పర్యావరణం కోసం పాఠశాల ఆవరణలోనే వేప చెట్లు నాటి ట్రీ గార్డ్ లు అమర్చారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఇమ్మడి సతీష్ మాట్లాడుతూ రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే విద్యార్థులు అందరూ మొక్కలు పెంపకాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు ఇమ్మడి సతీష్ బాబు, కార్యదర్శి సేకు శ్రీనివాసరావు, కోశాధికారి వెంపటి ప్రసాద్, ఐపీసీ చల్లా విజయశేఖర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పబ్బా గీత, యాదా రాణి, రీజియన్ చైర్మన్ జగిని ప్రసాద్, రీజియన్ సెక్రటరీ పైడిమర్రి సతీష్, జోన్ చైర్మన్ చల్లా లక్ష్మి నరసయ్య, క్లబ్ ప్రోగ్రాం ఆఫీసర్ దేవరశెట్టి శంకర్రావు, కపుల్స్ క్లబ్ కోశాధికారి శ్రీరంగం లక్ష్మణ్, స్కూల్ హెడ్ మాస్టర్ హరిప్రసాద్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు.
Related Images
Related News

చదువు కోసం... పర్యావరణం కోసం...
చదువు కోసం పర్యావరణం కోసం కృషి చేయాలనే కార్యక్రమం లో భా ...
గురు(తర) భాద్యత..!
మట్టిని మాణిక్యంగా.. మనిషిని మహోన్నతుడిగా.. బండరాయిని భగ ...
గ్రూప్స్ పరీక్షార్ధుల కోసం ..
1. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు? 1) ...